Share News

నూకాంబిక హుండీ ఆదాయం రూ.54,08,952

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:05 AM

స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీల కానుకల లెక్కింపు శుక్రవారం ఆలయ మండపంలో జరిగింది. మొత్తం 77 రోజులకుగాను భక్తులు కానుకులు, మొక్కుబడుల రూపంలో రూ.54,08,952 నగదు హుండీల్లో వేశారని ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో బీఎల్‌ నగేష్‌ తెలిపారు. ఇంకా బంగారం 20 గ్రాముల 50 మిల్లీగ్రాములు, వెండి ఒక కిలో 60 గ్రాములు వున్నాయన్నారు.

నూకాంబిక హుండీ ఆదాయం రూ.54,08,952
భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది, సేవా భక్తులు

20 గ్రాముల బంగారు, 1.06 కిలోల వెండి..

అనకాపల్లి టౌన్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీల కానుకల లెక్కింపు శుక్రవారం ఆలయ మండపంలో జరిగింది. మొత్తం 77 రోజులకుగాను భక్తులు కానుకులు, మొక్కుబడుల రూపంలో రూ.54,08,952 నగదు హుండీల్లో వేశారని ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో బీఎల్‌ నగేష్‌ తెలిపారు. ఇంకా బంగారం 20 గ్రాముల 50 మిల్లీగ్రాములు, వెండి ఒక కిలో 60 గ్రాములు వున్నాయన్నారు. కొంతమంది భక్తులు వివిధ దేశాల కరెన్సీని కూడా సమర్పించినట్టు తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి వైవీ రమణి, ఇన్‌స్పెక్టర్‌ బి.వసంతకుమార్‌ సమక్షంలో కానుకల లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూరే సతీశ్‌, దాడి రవికుమార్‌, పొలిమేర స్వాతి ఆనంద్‌, మారిశెట్టి శంకరరావు, యర్రవరపు సంతోషికుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 01:05 AM