నూకాంబిక హుండీ ఆదాయం రూ.37.24 లక్షలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:01 AM
స్థానిక నూకాంబిక అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానులను గురువారం ఆలయ కల్యాణ మండపంలో లెక్కించారు. గత మూడు నెలల్లో రూ.37,24,747 నగదు, 5.5 గ్రాముల బంగారం, ఒక 1,246 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయని ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్ తెలిపారు.
5.5 గ్రాముల బంగారం, 1,246 గ్రాముల వెండి కానుకలు
అనకాపల్లి టౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానులను గురువారం ఆలయ కల్యాణ మండపంలో లెక్కించారు. గత మూడు నెలల్లో రూ.37,24,747 నగదు, 5.5 గ్రాముల బంగారం, ఒక 1,246 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయని ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కేఎల్ సుధారాణి, ఇన్‌స్పెక్టర్ వసంతకుమార్, ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది, శ్రీవారి సేవా సభ్యులు పాల్గొన్నారు.