Share News

మూడో విడత పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్లు

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:08 AM

జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో శనివారం నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

మూడో విడత పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్లు

పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట

మండలాల్లో 91 పంచాయతీలు, 880 వార్డులు

23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

డిసెంబరు 2న ఎన్నికలు

పాడేరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో శనివారం నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నాలుగు మండలాల్లోని 91 పంచాయతీలు, 880 వార్డులకు నామినేషన్లను ఈనెల 23వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఒక్కో నామినేషన్‌ కేంద్రంలో మూడు లేదా నాలుగు పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరించేలా నాలుగు మండలాలోని 36 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లోని ఎన్నికల అధికారులు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్పంచ్‌, వార్డుల అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జిల్లాలోని పాడేరు మండలంలో 26 పంచాయతీలు.. 246 వార్డులు, అరకులోయలో 14 పంచాయతీలు..164 వార్డులు, డుంబ్రిగుడలో 18 పంచాయతీలు.. 188 వార్డులు, హుకుంపేట మండలంలో 33 పంచాయతీలు.. 282 వార్డులకు డిసెంబరు 2న ఎన్నికలు జరుగుతాయి. ఆ నాలుగు మండలాల్లో ఎన్నికలకు 880 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పాడేరు మండలంలో 44,536, అరకులోయలో 41,480, డుంబ్రిగుడలో 38,743, హుకుంపేటలో 45,787 మంది ఓటర్లున్నారు.

మూడో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల వార్డులు, ఓటర్ల వివరాలు....

వ.సం మండలం పేరు పంచాయతీలు వార్డులు/పోలింగ్‌ కేంద్రాలు మొత్తం ఓటర్లు

------------------------------------------------------------------------

1. పాడేరు 26 246 44,536

2. అరకులోయ 14 164 41,480

3. డుంబ్రిగుడ 18 188 38,743

4. హుకుంపేట 33 282 45,787

------------------------------------------------------------------------

మొత్తం 91 880 1,70,546

------------------------------------------------------------------------

Updated Date - Nov 21 , 2026 | 12:08 AM