Share News

పోటాపోటీగా నామినేషన్లు

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:22 AM

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కూటమి, వైసీపీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు.

పోటాపోటీగా నామినేషన్లు
పాడేరులో నామినేషన్‌ సమర్పించిన టీడీపీ నాయకురాలు అడపా ప్రీతి మధుమతి

11 జడ్పీటీసీ స్థానాలకు 123 మంది,

172 ఎంపీటీసీ స్థానాలకు 1,100 మంది నామినేషన్లు

కూటమి, వైసీపీ, ఇతర పార్టీలు, స్వతంత్రులు ఉత్సాహంగా నామినేషన్ల దాఖలు

పటిష్ట పోలీసు బందోబస్తుతో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం

పాడేరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కూటమి, వైసీపీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. జిల్లాలోని మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు శుక్రవారం రాత్రి 11 గంట సమయానికి 123 మంది నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించారు. వాస్తవానికి ఆఖరి రోజు కావడంతో మొత్తం 99 మందికి టోకెన్లను జారీ చేసినప్పటికీ 77 మందికి సంబంధించిన నామినేషన్లను రాత్రి 11 గంటలకు స్వీకరించారు. ఏ రాత్రికైనా మిగిలిన 22 మంది నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు 123 మంది నామినేషన్లు దాఖలు కాగా వాటిలో అత్యధికంగా అరకులోయ మండలంలో 19, అత్యల్పంగా కొయ్యూరు మండలంలో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ముందు నుంచి ఊహించిన విధంగానే జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు అధికంగానే నామినేషన్లు పడ్డాయి. మండలాల వారీగా నామినేషన్‌ వేసిన వారి వివరాలు పరిశీలిస్తే...

- పాడేరు జడ్పీటీసీ స్థానానికి అడపా కీర్తి మధుమతి (టీడీపీ), గిడ్డి ఈశ్వరి(టీడీపీ), కోడా వెంకట సురేశ్‌కుమార్‌ (టీడీపీ), సీదరి రాంబాబు (వైసీపీ), కూడా శాంతికుమారి (వైసీపీ), సీదరి రాంబాబు (వైసీపీ), కుడుముల దీప్తి(బీజేపీ), నందోలి ఉమామహేశ్వరరావు (బీజేపీ), సీదరి రామ్మూరి(జనసేన), బొంకుల దివ్యలత(జనసేన), పాంగి నవీన్‌(భారత చైతన్య యువజన పార్టీ), డప్పోడి కల్యాణ వరప్రసాద్‌(స్వతంత్ర), స్వాముల సుబ్రహ్మణ్యం(కాంగ్రెస్‌).

- చింతపల్లి స్థానానికి సాగిన అన్నపూర్ణ దేవి(టీడీపీ), వనుము రత్నకుమారి(టీడీపీ), గెమ్మెలి సంధ్యావెంకట పద్మప్రియ(టీడీపీ), ఉల్లి సింహాచలం(జనసేన), మొట్టడం ప్రభ(జనసేన), గుసుముల శ్రావణి(వైసీపీ), కోరాబు అనూషదేవి(వైసీపీ), పులిమెట్ల రమణకుమారి(వైసీపీ), కూడ సావిత్రి(బీజేపీ), కొర్రా శాంతమ్మ(కాంగెస్‌),

-అరకులోయ స్థానానికి పెట్టెలి దాసుబాబు(టీడీపీ), కొర్రా ఉపమ్మ(టీడీపీ), గోల్లోరి సుబ్బారావు(టీడీపీ), చిట్టం నీలమ్మ(టీడీపీ), బోయ దామోదర్‌(టీడీపీ), పాచిపెంట చినస్వామి(కాంగ్రెస్‌), పాచిపెంట శాంతకుమారి(కాంగ్రెస్‌), తెలగంజి సోమేశ్వరరావు(కాంగ్రెస్‌), దురియా ఆనంద్‌కుమార్‌(వైసీపీ), కంబిడి అశోక్‌(వైసీపీ), శెట్టి రోషిణి(వైసీపీ), ఎం.బాలరాజు(వైసీపీ), పాంగి చిన్నారావు(వైసీపీ), గెమ్మెలి చినబాబు(సీపీఎం), అగతంబిడి కృష్ణమూర్తి(బీజేపీ), కొర్రా మధుసూదనరావు(జనసేన), గెమ్మెలి చినబాబు(సీపీఎం), శెట్టి దివ్య(ఆమ్‌ఆద్మీ), శెట్టి లక్ష్మీనారాయణ(బీఎస్‌పీ)

-హుకుంపేట స్థానానికి పొట్టంగి పద్మ(టీడీపీ), సీదరి సావిత్రి(టీడీపీ), మఠం శాంతకుమారి(బీజేపీ), జంపరంగి లిల్లీ(వైసీపీ), కిలగాడ సింహాచలం(వైసీపీ), దనసాని సత్యవతి(వైసీపీ), సమిడ వెంకటపూర్ణిమ(వైసీపీ), ఒంటోబు శ్రీలేఖ(వైసీపీ), ఒంటోబు ప్రియాంక(వైసీపీ), సీదరి దేవి(భారత చైతన్య యువజన పార్టీ), సాగరి సుశీల(ఆమ్‌ఆద్మీ), నైని రజని(జనసేన), వంతాల తులసీ(కాంగ్రెస్‌), రేగం రత్నకుమారి(స్వతంత్ర), పవన్‌ శ్రావణి(స్వత్రంత)

-ముంచంగిపుట్టు స్థానానికి పాంగి పాండురంగస్వామి(టీడీపీ), కిల్లో సన్యాసమ్మ(టీడీపీ), వండలబు లక్ష్మణ(టీడీపీ), జల్లిపల్లి సుభద్ర(వైసీపీ), అరబీరు జగబందు(వైసీపీ), వెచ్చంగి సుభాశ్‌చంద్ర(వైసీపీ), రెయ్యల శ్రావణ్‌కుమార్‌(జనసేన), కొర్రా త్రినాథ్‌(సీపీఎం), పాంగి మల్లికార్జునరావు(కాంగ్రెస్‌), సమరెడ్డి పూర్ణచంద్రరరావు(స్వతంత్ర), వంతెనిభ మాధవరావు(స్వతంత్ర)

-కొయ్యూరు స్థానానికి మొట్టడం హిమబిందు (టీడీపీ), గొడ్డేటి మాధవి(వైసీపీ), సుర్ల లఖితరాజశ్రీ(వైసీపీ),బచ్చలి అన్నపూర్ణ(బీజేపీ),

-అనంతగిరి స్థానానికి పాంగి ఎర్రయ్య(టీడీపీ), చిత్తం రాధ(టీడీపీ), పాంగి ఎర్రమ్మ(టీడీపీ), జంపరంగి లక్ష్మి(టీడీపీ),బావన సాయిజయశ్రీ(జనసేన), మజ్జి జయవర్థిని(వైసీపీ), గరం పూర్ణచంద్ర(వైసీపీ), గెమ్మెలి బేబీ శాంతి(వైసీపీ), కిల్లో మనీషా(స్వతంత్ర), వంతాల మేరీ(ఆమ్‌ఆద్మీ),

-డుంబ్రిగుడ స్థానానికి తుడుము సుబ్బారావు(టీడీపీ), తాంగుల కృష్ణారావు(టీడీపీ), కుంబిశెట్టి కళావతి(టీడీపీ), తడబారికి చిన్నగెన్ను(టీడీపీ), కోనేది మాలతి(జనసేన), సొనబారికి పోతురాజు(సీపీఎం), కొర్రా పరశురామ్‌(కాంగ్రెస్‌ పార్టీ), బిసాయి ధర్మరాజు(బీజేపీ), తాంగుల లలితకుమారి(బీజేపీ), వంతాల దేవదాసు(బీజేపీ) కుంబిడి హరి(వైసీపీ), కిముడు అశ్వని(వైసీపీ), కిల్లో సురేశ్‌(ఆమ్‌ఆద్మీ), కిల్లో రాజభరత్‌(భారత చైతన్య యువజన పార్టీ), తాంగుల రామదాస్‌(స్వతంత్ర)

-జీకేవీధి స్థానానికి సిరిబాల బొంజుబాబు(టీడీపీ), వంపూరంగి బుచ్చిబాబు(సీపీఐ), గొర్లె వీరవెంకట సత్యనారాయణ(జనసేన), పాంగి కృష్ణారావు(జనసేన), కిట్లంగి పద్మ(జనసేన), రొబ్బా పుష్పలక్ష్మి(బీజేపీ), సీదరి సింహాచలం(బీజేపీ), కంకిపాటి గిరిప్రసాద్‌(వైసీపీ), కుండరి రామకృష్ణ(వైసీపీ), వంతాల చంటిబాబు(వైసీపీ), దుక్కెరి ప్రభాకరరావు(బీజేపీ), కిల్లో రంగారావు(భారత చైతన్య యువజన పార్టీ), సాగిన పుష్పకుమారి(స్వతంత్ర),

-జి.మాడుగుల స్థానానికి సోమెలి అఖిలప్రియ(టీడీపీ), సోమెలి ప్రేమలత(టీడీపీ), లోచలి సత్యవతి(వైసీపీ), ఐసరం మహేశ్వరి(వైసీపీ), వంతాల కాంతమ్మ(భారత చైతన్య యువజన పార్టీ), పాంగి సుమిత్ర(జనసేన), రమి బాల(స్వతంత్ర),

-పెదబయలు స్థానానికి సీకరి సుకుమారి(టీడీపీ), వంతాల శాంతి(వైసీపీ), కొర్రా శోభారాణి(కాంగ్రెస్‌), కోరపాటి సోమిక(బీఎస్‌పీ), కుంభం బృహస్పతి(స్వతంత్ర) నామినేషన్‌ దాఖలు చేశారు. వారి నుంచి జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు, సహాయ రిటర్నింగ్‌ అధికారి ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, జడ్పీ ఏవో సతీశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

నామినేషన్‌ కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించే స్థానిక ఐటీడీఏ కార్యాలయం, ఎంపీటీసీ స్థానాల నామినేషన్లను స్వీకరించే మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే నామినేషన్‌ వేసే అభ్యర్థి, అతనికి మద్దతు ఇచ్చే మరో ఇద్దరికి మాత్రమే నామినేషన్‌ సెంటర్‌ లోపలకు అనుమతిస్తున్నారు. నామినేషన్‌ సెంటర్‌కు 200 మీటర్ల దూరం వరకు ఎవరూ గుంపులుగా సంచరించకుండా, ఎటువంటి వాహనాలను నిలపకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలో నామినేషన్ల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది.

జిల్లాలో మండలాలు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్ల వివరాలు

వ.సం. మండలం జడ్పీటీసీ నామినేషన్లు ఎంపీటీసీ స్థానాలు దాఖలైన నామినేషన్లు

1. అనంతగిరి 10 14 108

2. అరకులోయ 19 16 124

3. చింతపల్లి 11 20 120

4. డుంబ్రిగుడ 15 14 113

5. జీకేవీధి 13 18 103

6. జి.మాడుగుల 7 15 93

7. హుకుంపేట 15 15 96

8. కొయ్యూరు 4 14 91

9. ముంచంగిపుట్టు 11 14 61

10. పెదబయలు 5 15 105

11. పాడేరు 13 17 86

--------------------------------------------------------------

మొత్తం 123 172 1,100

--------------------------------------------------------------

Updated Date - Oct 24 , 2026 | 12:22 AM