ముగిసిన నామినేషన్ల ఘట్టం
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:37 AM
తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో జిల్లాలో తొలి దశ పంచాయతీ పోరులో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. దీంతో పలు గ్రామాల్లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది.
తొలి విడత ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలు
రెండు వాయిదా 8 31 ఏకగ్రీవం
184 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 502 మంది పోటీ217
అనకాపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో జిల్లాలో తొలి దశ పంచాయతీ పోరులో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. దీంతో పలు గ్రామాల్లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది.
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయగా, గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో తొలి దశ ఎన్నికలు 217 పంచాయతీల్లో జరగాల్సి ఉండగా అనకాపల్లిలో రెండు వాయిదా పడ్డాయి. దీంతో 215 పంచాయతీలకు గాను 31 ఏకగ్రీవం కాగా, మిగతా 184 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు 502 మంది బరిలో నిలిచారు. కాగా 1,959 వార్డులకు గాను ... మంది పోటీలో ఉన్నారు.
శనివారం రాత్రి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో బుచ్చెయ్యపేట మండలంలో 35 పంచాయతీలకు 5 ఏకగ్రీవం కాగా, 30 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు బరిలో 71 మంది ఉన్నారు. వార్డులు 320కి గాను 69 ఏకగ్రీవం కావడంతో 251 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి 526 మంది పోటీలో ఉన్నారు. చోడవరం మండలంలో 32 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కావడంతో 30 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు 72 మంది పోటీ పడుతున్నారు. 320 వార్డులకు గాను 40 ఏకగ్రీవం కాగా, 280 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ వార్డులకు 560 మంది పోటీలో ఉన్నారు. రోలుగుంటలో 24 పంచాయతీలకు గాను 3 ఏకగ్రీవం కాగా, 21 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచ్ పదవులకు 49 మంది పోటీ పడుతున్నారు. 228 వార్డులకు 29 ఏకగ్రీవం కాగా, 199 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి 415 మంది బరిలో ఉన్నారు. కశింకోటలో 27 పంచాయతీలకు గాను నాలుగు ఏకగ్రీవం కాగా, 23 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచ్ స్థానాలకు 59 మంది పోటీ పడుతున్నారు. 272 వార్డులకు గాను 45 ఏకగ్రీవం కావడంతో 227 వార్డులకు 473 మంది బరిలో ఉన్నారు. పరవాడలో 15 పంచాయతీలకుగాను 40 మంది పోటీలో ఉన్నారు. 164 వార్డులకు గాను 10 వార్డులు ఏకగ్రీవం కాగా, 154 వార్డులకు 342 మంది పోటీలో ఉన్నారు. సబ్బవరంలో 24 పంచాయతీలకు గాను 4 ఏకగ్రీవం కాగా, 20 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులుకు 54 మంది బరిలో ఉన్నారు. 244 వార్డులకు 74 ఏకగ్రీవం కావడంతో 170 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 410 మంది పోటీలో ఉన్నారు. రావికమతంలో 28 పంచాయతీలకు గాను 8 ఏకగ్రీవం కావడంతో 20 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచ్ పదవులకు 49 మంది పోటీలో ఉన్నారు. 288 వార్డులకు 94 ఏకగ్రీవం కావడంతో 194 వార్డులకు 391 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పలు గ్రామాల్లో ద్విముఖ, త్రిముఖ పోటీ జరగనుందని స్పష్టమవుతోంది. మరికొన్ని గ్రామాల్లో అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికలు ఉత్కంఠభరింతంగా మారనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల మద్ధతుతో పాటు స్థానిక వర్గాల సమీకరణాలు కూడా ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.