Share News

జీవీఎంసీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:02 AM

భీమిలి జోన్‌ (1-5 వార్డులు)... భీమిలి జోనల్‌ కార్యాలయం

జీవీఎంసీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు

భీమిలి జోన్‌ (1-5 వార్డులు): భీమిలి జోనల్‌ కార్యాలయం

మధురవాడ జోన్‌ (6-12 వార్డులు): మధురవాడ జోనల్‌ కార్యాలయం

ఈస్ట్‌ జోన్‌ (12-29 వార్డులు): ఈస్ట్‌ జోన్‌ కార్యాలయం

సౌత్‌ జోన్‌ (30-45 వార్డులు): సౌత్‌ జోన్‌ కార్యాలయం, సూర్యాబాగ్‌

నార్త్‌జోన్‌ (46-65వార్డులు): నార్త్‌జోన్‌ కార్యాలయం, వుడా లేఅవుట్‌, మాధవధార

వెస్ట్‌జోన్‌ (66-82 వార్డులు): వెస్ట్‌జోన్‌ కార్యాలయం, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు

గాజువాక జోన్‌ (83-101 వార్డులు): గాజువాక జోనల్‌ కార్యాలయం

అగనంపూడి జోన్‌ (102-106 వార్డులు): అగనంపూడి జోనల్‌ కార్యాలయం, రాజీవ్‌ నగర్‌ కళ్యాణ మండపం, అగనంపూడి

అనకాపల్లి జోన్‌ (107-112 వార్డులు): అనకాపల్లి జోనల్‌ కార్యాలయం, నాలుగురోడ్ల జంక్షన్‌, అనకాపల్లి

పెందుర్తి జోన్‌ (113-120 వార్డులు): పెందుర్తి జోనల్‌ కార్యాలయం, వేపగుంట


వైసీపీ మేయర్‌ అభ్యర్థినిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి?

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థినిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేరును వైసీపీ అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు గురువారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న జీవీఎంసీ మేయర్‌ ఎన్నిక నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బుధవారం ప్రకటించారు. నామినేషన్‌న్లు శుక్రవారం నుంచి ఆదివారం వరకూ స్వీకరించనున్నారు. ఉపసంహరణకు 21వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. మేయర్‌ సీటు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో వరుదు కళ్యాణితో పాటు పలువురు నేతల కుటుంబాలకు చెందిన మహిళల పేర్లు, మరికొందరి మహిళా నేతల పేర్లు వైసీపీ పరిశీలించింది. చివరకు వరుదు కళ్యాణి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపినట్టు తెలిసింది.


35 స్పెషల్స్‌ నడిపిన ఆర్టీసీ

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

దసరా ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ విశాఖ రీజియన్‌ అధికారులు బుధవారం 35 ప్రత్యేక సర్వీసులు నడిపారు. ప్రత్యేక సర్వీస్‌లలో 20 శ్రీకాకుళం జిల్లాకు, పది బస్సులు విజయనగరం జిల్లాకు, విజయవాడ, రాజమండ్రిలకు రెండేసి, హైదరాబాద్‌కు ఒక ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఆర్‌ఎం బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కె.పద్మావతి ట్రాఫిక్‌ నియంత్రణను పర్యవేక్షించారు.


నేడు విశాఖ-చర్లపల్లి ప్రత్యేక రైలు

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ఒక ట్రిప్పు (రానుపోను) ప్రత్యేక రైలు నడుపుతున్నామని అధికారులు ప్రకటించారు. విశాఖ-చర్లపల్లి ప్రత్యేక రైలు గురువారం రాత్రి తొమ్మిది గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.05 గంటలకు చర్లపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి-విశాఖ ప్రత్యేక రైలు ఈ నెల 16న మధ్యాహ్నం 3.50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం ఐదు గంటలకు విశాఖ చేరుతుందన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 01:02 AM