Share News

ఇంధన కొరత లేదు

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:43 AM

జిల్లాలో దాదాపు అన్ని బంకుల్లో పెట్రోల్‌, డిజిల్‌ అందుబాటులో వుందని పౌర సరఫరాల శాఖ అధికారి కేవీఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు. వివిధ కారణాల వల్ల రెండు, మూడు రోజుల నుంచి బంకుల్లో డీజిల్‌ కొరత తీవ్రంగా వుందని, కొన్నిచోట్ల పెట్రోల్‌ కూడా లేదని, దీంతో వాహనదారుల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో ఐఓసీ, బీపీసీ, హెచ్‌పీసీలకు చెందిన బంకులు 161 వున్నాయని, ఈ బంకుల ద్వారా రోజూ 400 కిలోలీటర్ల పెట్రోలు, 500 కిలోలీటర్ల డిజిల్‌ అమ్మకాలు సాగుతుంటాయని చెప్పారు.

ఇంధన కొరత లేదు
కేవీఎల్‌ఎన్‌ మూర్తి, డీఎస్‌ఓ

బంకుల్లో సమృద్ధిగా పెట్రోల్‌, డిజిల్‌

పౌర సరఫరాల శాఖ అధికారి కేవీఎల్‌ఎన్‌ మూర్తి

అనకాపల్లి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దాదాపు అన్ని బంకుల్లో పెట్రోల్‌, డిజిల్‌ అందుబాటులో వుందని పౌర సరఫరాల శాఖ అధికారి కేవీఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు. వివిధ కారణాల వల్ల రెండు, మూడు రోజుల నుంచి బంకుల్లో డీజిల్‌ కొరత తీవ్రంగా వుందని, కొన్నిచోట్ల పెట్రోల్‌ కూడా లేదని, దీంతో వాహనదారుల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో ఐఓసీ, బీపీసీ, హెచ్‌పీసీలకు చెందిన బంకులు 161 వున్నాయని, ఈ బంకుల ద్వారా రోజూ 400 కిలోలీటర్ల పెట్రోలు, 500 కిలోలీటర్ల డిజిల్‌ అమ్మకాలు సాగుతుంటాయని చెప్పారు. మంగళవారం ఉదయం అన్ని బంకుల్లో 694 కిలోలీటర్ల పెట్రోలు, 1,124 కిలోలీటర్ల డిజిల్‌ నిల్వలు ఉన్నాయన్నారు. పెట్రోలు, డీజిల్‌ కృత్రిమ కొరత సృష్టించే వారిపై దృష్టి పెట్టామని తెలిపారు. పెట్రోలు, డీజిల్‌ లేదని బంకుల నిర్వాహకులు ఎవరైనా చెబితే.. వెంటనే కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌కు ( 08924-222888, 08924-226599) ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు.

Updated Date - Apr 29 , 2026 | 12:43 AM