వన్డే జట్టులో నితీష్‌కు చోటు
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:11 AM
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో నగరానికి చెందిన నితీష్‌కుమార్‌రెడ్డికి స్థానం లభించింది. ఈనెల 11న వడోదరలో, 14న రాజ్‌కోట్‌లో, 18న ఇండోర్‌లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈనెల 18 నుంచి జరగనున్న టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కని నితీష్‌కుమారెడ్డి వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.
న్యూజిలాండ్‌లో జరగనున్న సిరీస్‌కు ఎంపిక
విశాఖపట్నం, స్పోర్ట్స్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో నగరానికి చెందిన నితీష్‌కుమార్‌రెడ్డికి స్థానం లభించింది. ఈనెల 11న వడోదరలో, 14న రాజ్‌కోట్‌లో, 18న ఇండోర్‌లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈనెల 18 నుంచి జరగనున్న టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కని నితీష్‌కుమారెడ్డి వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.
ఇటీవల దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్ట్‌లో బెంచ్‌కు పరిమితమైన నితీష్‌కు...గువహటిలో జరిగిన రెండో టెస్టులో ఆడే అవకాశం లభించింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం పది పరుగులు మాత్రమే చేసిన నితీష్...రెండో ఇన్నింగ్ డకౌట్ (0) అయ్యాడు. దాంతో తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. వన్డే సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు నితీష్‌కుమార్‌రెడ్డిని జట్టు నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు ఎంపిక చేసిన వన్డే జట్టులో నితీష్‌కుమార్‌కు చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.