Share News

నౌకాదళానికి ‘నిపుణ్‌’

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:17 AM

విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) మరో ఘనతను సొంతం చేసుకుంది.

నౌకాదళానికి ‘నిపుణ్‌’

అత్యాధునిక డైవింగ్‌ సపోర్టు వెసల్‌ను తయారుచేసిన హెచ్‌ఎస్‌ఎల్‌

మల్కాపురం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) మరో ఘనతను సొంతం చేసుకుంది. భారత నౌకా దళానికి అత్యాధునిక డైవింగ్‌ సపోర్టు వెసల్‌ (డీఎస్‌వీ)...సముద్రంలో డైవింగ్‌ పనులకు, నీటి లోపల అన్వేషణలకు, రెస్క్యూ ఆపరేషన్‌లకు సహాయపడే ఒక ప్రత్యేకమైన నౌక (నిపుణ్‌)ను తయారుచేసి గురువారం అధికారికంగా అప్పగించింది. దీంతో భారత నౌకదళం సామర్థ్యం, సముద్ర భద్రత మరింత బలోపేతం కానున్నాయి. నౌక అప్పగింత సందర్భంగా వెస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ చీఫ్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ (టెక్నికల్‌) రియర్‌ అడ్మిరల్‌ అరవింద్‌ రావల్‌, హెచ్‌ఎస్‌ఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రియర్‌ అడ్మిరల్‌ చంద్రశేఖరన్‌ రఘురామ్‌ అంగీకార పత్రాలపై సంతాకాలు చేశారు.

నిపుణ్‌ ప్రత్యేకతలు

- డైవింగ్‌ ఆపరేషన్లకు ప్రత్యేకంగా రూపొందించిన అధునిక నౌక

- సముద్రంలో అత్యవసర రక్షణ చర్యలకు వినియోగం

- జలాంతర్గాముల నిర్వహణ, సాంకేతిక సహాయానికి ఉపయోగం

Updated Date - Jul 31 , 2026 | 01:17 AM