Share News

న్యూ ఇయర్‌ జోష్‌

ABN , Publish Date - Jan 01 , 2026 | 01:12 AM

విశాఖ ప్రజలు 2026కి ఘనంగా స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌ కోసం అన్ని హోటళ్లు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. రాత్రి ఎనిమిది గంటల నుంచే డీజే మ్యూజిక్‌, పసందైన వంటకాలతో ఆహుతులను అలరించాయి.

న్యూ ఇయర్‌ జోష్‌

నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన నగరవాసులు

కిక్కిరిసిన బీచ్‌రోడ్డు

మ్యూజిక్‌తో హోరెత్తిన హోటళ్లు

అపార్టుమెంట్లలో వేడుకలు

విశాఖపట్నం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ప్రజలు 2026కి ఘనంగా స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌ కోసం అన్ని హోటళ్లు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. రాత్రి ఎనిమిది గంటల నుంచే డీజే మ్యూజిక్‌, పసందైన వంటకాలతో ఆహుతులను అలరించాయి. నోవాటెల్‌ హోటల్‌లో మాఫియా థీమ్‌తో ఒక పార్టీ, జంగిల్‌ పేరుతో మరో పార్టీ నిర్వహించారు. ది పార్క్‌ హోటల్‌లో కాస్మిక్‌ రోబోతే డీజే వాయించారు. ఫ్యాషన్‌ షో నిర్వహించారు. గ్రహాంతర వాసుల వేషాలతో డ్యాన్స్‌లు చేశారు. లాసన్స్‌ బే కాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌లో ప్రత్యేక సంగీత కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనికి ‘పాడుతా తీయగా...’ విజేత సార్థక్‌, జీ సరిగమప, మా సూపర్‌ సింగర్‌ ఫైనలిస్ట్‌ సింగర్‌ అమితలతో డీజే సన్నీ హాజరయ్యారు. ఇంకా గ్రీన్‌ పార్క్‌, డాల్ఫిన్‌, వెస్ట్‌ బెస్టర్న్‌, ఫోర్‌ పాయింట్స్‌, ఎలిగెంట్‌ హోటళ్లలో గాలా డిన్నర్‌లు ఏర్పాటుచేశారు. బీచ్‌రోడ్డు సందర్శకులతో కిటకిటలాడింది. సీతమ్మధార ఆక్సిజన్‌ టవర్స్‌, మద్దిలపాలెంలో దేవి హోమ్స్‌, ఎండాడలో వైశాఖి స్కైలైన్‌, పీఎం పాలెం ఎంవీవీ సిటీలోని గేటెడ్‌ కమ్యూనిటీల్లోను న్యూ ఇయర్‌ వేడుకలు భారీగా నిర్వహించారు. పిల్లలకు పోటీలు నిర్వహించి, యువజంటలతో డ్యాన్స్‌లు చేయించారు. అపార్టుమెంట్లలో న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కేకులు, బొకేలకు భలే డిమాండ్‌

న్యూ ఇయర్‌ సందర్భంగా నగరంలో వివిధ రకాల కేకులు, పూల బొకేలకు డిమాండ్‌ ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే కేకుల అమ్మకాలు 25 శాతం మేర పెరిగాయని బేకరీ యజమానులు తెలిపారు. కూల్‌ కేకులపై అధికశాతం మంది ఆసక్తి చూపారన్నారు. మొత్తంగా 100 నుంచి 150 టన్నుల కేకులను విక్రయించామన్నారు. దీంతో సుమారు రూ.7 కోట్ల వ్యాపారం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఇక పూల బొకేల ధరలు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. అయినప్పటికీ విక్రయాలు తగ్గలేదు. కనీసం పది శాతం మేర పెరిగాయి. సాధారణ బొకే రూ.500 నుంచి రూ.750 వరకు ధర పలకగా, కడియం నర్సరీ నుంచి తెప్పించిన ప్రత్యేక పూలతో రూపొందించిన బొకేలు రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు విక్రయించారు. వీటితో పాటు డ్రైఫ్రూట్స్‌, ఫ్రూట్‌ బాస్కెట్స్‌, స్వీట్‌ బాక్సులకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. గిఫ్టుబాక్సుల రూపంలో విక్రయానికి సిద్ధం చేసిన వీటి ధరలు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పలికాయి.

Updated Date - Jan 01 , 2026 | 01:12 AM