రెవెన్యూ సంఘం జిల్లా నూతన కమిటీ
ABN , Publish Date - Feb 02 , 2026 | 01:08 AM
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం ఇక్కడ జరిగాయి.
కొత్తూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం ఇక్కడ జరిగాయి. అధ్యక్షునిగా కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకుడు ఎస్‌ఎస్‌వీఎస్ నాయుడు (వాసు) ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా యలమంచిలి శ్రీరామమూర్తి (డీటీ, బుచ్చెయ్యపేట), కోశాధికారిగా కె.వరహాలు (తహశీల్దార్, ఎలమంచిలి), అసోసియేట్ అధ్యక్షులుగా కె.సురేశ్‌నాయుడు (కలెక్టరేట్), పి.రమేశ్ (డీటీ, కోటవురట్ల), ఎంఎల్ అరుణ్‌కుమార్ (డీటీ, పరవాడ), సీవీ చయనులు (డీటీ, గొలుగొండ), ఎం.జయశ్రీ (కలెక్టరేట్), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జీవీ రామకృష్ణ (డీటీ, కశింకోట), కల్చరల్ కార్యదర్శిగా టీహెచ్ వినయ్‌కుమార్ (ఎలమంచిలి), సంయుక్త కార్యదర్శులుగా డి.శ్రీనివాసరావు (కలెక్టరేట్), జీ.వీరవాణి (డీటీ, నక్కపల్లి), ఎం.శివ (కలెక్టరేట్), ఈసీ సభ్యులుగా ఎం.ఆశాజ్యోతి (ఆర్డీవో ఆఫీస్, నర్సీపట్నం), ఎస్.ప్రసాద్ (ఎస్‌ఏ, నక్కపల్లి), పి.వెంకటేశ్ (జేఏ, చీడికాడ), వై.శివకుమార్ (జేఏ, అనకాపల్లి) ఎన్నికయ్యారు. ఎన్నికల ఆధికారులుగా విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఏ త్రినాథరావు, పి.శ్యాం ప్రసాద్, రాష్ట్ర పరిశీలకుడుగా కల్చరల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డి.రాజేంద్ర వర్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు చుండూరు చంద్రశేఖర్, అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు పీవీ రత్నం, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌గా శ్రీరామమూర్తి
అనకాపల్లి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఏఎస్ శంకరన్ భవన్‌లో జిల్లా ఉద్యోగుల సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌గా ఎలమంచిలి శ్రీరామమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.