Share News

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో కొత్త కోర్సులు

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:13 AM

ప్రభుత్వ మానసిక ఆస్పత్రి అప్‌గ్రేడేషన్‌లో భాగంగా మంజూరైన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో కొత్త కోర్సుల నిర్వహణకు అధికా రులు సిద్ధమవుతున్నారు.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో కొత్త కోర్సులు

  • వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభానికి సన్నాహాలు

  • చెరో 30 సీట్లతో క్లినికల్‌ సైకాలజీ, సైకియాట్రీ సోషల్‌ వర్క్‌ కోర్సులు

  • నర్సింగ్‌ కాలేజీలోని సైకియాట్రీ కోర్సులు మార్పు

  • ఏఎంసీ అధికారులకు ప్రతిపాదనలు

విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ మానసిక ఆస్పత్రి అప్‌గ్రేడేషన్‌లో భాగంగా మంజూరైన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో కొత్త కోర్సుల నిర్వహణకు అధికా రులు సిద్ధమవుతున్నారు. పెదవాల్తేరులోని మానసిక ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ భవనం ఇటీవల ప్రారంభించారు. దీంతో పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. మానసిక ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అం దించడంతోపాటు నిపుణులను తయారుచేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా అప్‌గ్రేడ్‌ చేసిం ది. ఇందులో భాగంగానే కొత్త కోర్సులకు అవకాశం లభించింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే కేజీహెచ్‌ ఆవరణలోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో సైకియాట్రీ నర్సింగ్‌ కోర్సును నిర్వహిస్తున్నారు. మూడేళ్ల కోర్సులో 2024-25కు పదిమంది విద్యార్థులు చేరగా, 2025-26లో కేవలం ఒక్క విద్యార్థి చేరారు. మౌలిక వసతులు, ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్‌ లేకపోవడం, ఇతర కారణాలతో ఎక్కువమంది ఆసక్తి చూపించడం లేదు. దీంతో మెంటల్‌కేర్‌ ఆస్పత్రి అధికారులు ఈ కోర్సులను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంధ్ర మెడికల్‌ కళాశాల అధికారులకు లేఖ రాశారు. గ్రీన్‌సిగ్నల్‌ లభిస్తే ఫిబ్రవరి తొలి వారం నుంచి ఈ భవనంలో తరగతులు నిర్వహిస్తారు. కోర్సు నిర్వహణకు నలుగురు ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నారు.

ఈ కోర్సుల్లో ప్రవేశాలు

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో క్లినికల్‌ సైకాలజిస్ట్‌, సైకి యాట్రీ సోషల్‌వర్క్‌ కోర్సులను 30 చొప్పున సీట్లతో ప్రారం భించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అను మతి కోరుతూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికా రులకు ఫైల్‌ పెట్టారు. అనుమతి లభిస్తే రీహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌సీఐ)ను అప్రోచ్‌ అవుతారు. అక్కడి నుంచి అధికారుల బృందం తనిఖీకి వస్తుంది. మౌలిక వసతులు, సదుపాయాలను పరిశీలించిన తరు వాత అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయి. ఒక్కో కోర్సు నిర్వహణకు ఒక ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సిబ్బందిని నియమిస్తామని అధికారులు చెబుతున్నారు. తొలుత సైకియాట్రీ సోషల్‌వర్క్‌ కోర్సుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని, విద్యా ర్థులకు హాస్టల్‌, లైబ్రరీ, ఫ్యాకల్టీ చాంబర్స్‌ను సిద్ధం చేస్తు న్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామిరెడ్డి తెలిపారు.

Updated Date - Jan 12 , 2026 | 01:13 AM