17 నుంచి కొత్త అమావాస్య జాతర
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:25 AM
స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఈ నెల 17వ తేదీన ప్రారంభం అవుతుందని ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను చెప్పారు. మంగళవారం ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో ఆయన మాట్లాడుతూ.. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినందున అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.
మరుసటి రోజు నూకాంబిక అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించనున్న మంత్రి కొల్లు రవీంద్ర
ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను వెల్లడి
కొత్తూరు (అనకాపల్లి), మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఈ నెల 17వ తేదీన ప్రారంభం అవుతుందని ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను చెప్పారు. మంగళవారం ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో ఆయన మాట్లాడుతూ.. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినందున అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే నెల 17వ తేదీ వరకు జరిగే ఈ జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 17వ తేదీ మంగళవారం రాత్రి జాతర ఆరంభం అవుతుందని, 18వ తేదీన కొత్త అమావాస్య పండుగ సందర్భంగా నూకాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర పట్టువస్ర్తాలు సమర్పిస్తారని తెలియజేశారు. ఏప్రిల్ 1న ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సమావేశంలో దేవదాయ శాఖ జిల్లా అధికారి సుధారాణి, ఆలయ ఈవో యాళ్ల శ్రీధర్, ధర్మకర్తలు సూరే సతీశ్‌కుమార్, దాడి రవికుమార్, మారిశెట్టి శంకరరావు, కొడుకుల శ్రీకాంత్, కాండ్రేగుల రాజారావు, పొలిమేర స్వామి ఆనంద్‌కుమార్, వడ్డాది మంగ, మజ్జి జానకి, యర్రవరపు సంతోషికుమారి, కోనేటి సూర్యలక్ష్మి పాల్గొన్నారు.