Share News

కళా గ్రామంలో నేవీ కుటుంబీకుల సందడి

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:29 AM

ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2026లో పాల్గొనేందుకు విశాఖ విచ్చేసిన నౌకాదళ అధికారులు, వారి కుటుంబ సభ్యులు మరికొందరు శనివారం మండలంలోని పెదగాడిలో గల సంకల్ప కళా గ్రామాన్ని సందర్శించారు.

కళా గ్రామంలో నేవీ కుటుంబీకుల సందడి

పెందుర్తి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2026లో పాల్గొనేందుకు విశాఖ విచ్చేసిన నౌకాదళ అధికారులు, వారి కుటుంబ సభ్యులు మరికొందరు శనివారం మండలంలోని పెదగాడిలో గల సంకల్ప కళా గ్రామాన్ని సందర్శించారు. సహజ సిద్ధమైన రంగులతో కూడిన చేనేత వస్త్రాల తయారీని, కొబ్బరి చిప్పలతో చేసిన కళాకృతులను ఆసక్తిగా తిలకించారు. నర్సరీలో ఉన్న వివిధ జాతుల పూల సౌందర్యానికి పరవశించారు. నేవీ అధికారుల కుటుంబాల్లోని మహిళలు స్వహస్తాలతో తిరగలి తిప్పారు. రోలులో రోకలితో దినుసులను దంచారు. టై అండ్‌ డైలో దుస్తులు నేసి, రంగులు అద్దారు. ప్రకృతి ఆధారంగా పండించిన పంటలతో తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. నేవీ అతిఽథులకు కళా గ్రామం నిర్వాహకులు ఆకులు చలపతిరావు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.

Updated Date - Feb 22 , 2026 | 01:29 AM