గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయి గుర్తింపు
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:55 PM
గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు.
జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్
విశాఖలో ‘ఆది బజార్’ ప్రారంభం
పాడేరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ట్రైఫెడ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ‘ఆది బజార్’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ గిరిజనులు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ద్వారా చక్కని ఆదాయం లభిస్తుందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తామమన్నారు. గిరిజనుల ఆదాయాన్ని పెంచేందుకు జీసీసీ నిరంతరం కృషి చేస్తుందని చైర్మన్ పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ట్రైఫెడ్ విశాఖపట్నంలో ఆది బజార్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా గిరిజన ఉత్పత్తులకు గుర్తింపుతోపాటు మార్కెటింగ్ సదుపాయం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈకార్యక్రమంలో ట్రైఫెడ్ హైదరాబాద్ రీజనల్ మేనేజర్ రాజన్, సీనియర్ మేనేజర్ కె.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.