శృంగవరానికి జాతీయ పురస్కారం
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:09 AM
జాతీయ స్థాయిలో గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన)లో మొదటి స్థానంలో నిలిచిన మండలంలోని శృంగవరం పంచాయతీకి బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని అందించింది.
సుపరిపాలనలో మొదటి ర్యాంకు
అవార్డుతోపాటు రూ.కోటి నగదు పురస్కారం
ఢిల్లీలో అందుకున్న రాష్ట్ర, జిల్లా, పంచాయతీ అధికారులు
నాతవరం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
జాతీయ స్థాయిలో గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన)లో మొదటి స్థానంలో నిలిచిన మండలంలోని శృంగవరం పంచాయతీకి బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని అందించింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఇ.సందీప్, శృంగవరం పంచాయతీ కార్యదర్శి వి.శ్రీనివారావు.. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వివేక భరద్వాజ్ చేతుల మీదుగా అవార్డును, కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ కూడా పాల్గొన్నారు.