Share News

నక్కపల్లి సీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌

ABN , Publish Date - Aug 14 , 2026 | 01:00 AM

గ్రామీణులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగా నక్కపల్లిలోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని త్వరలో 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. గురువారం నక్కపల్లి ఆస్పత్రిని ఆమె తనిఖీ చే శారు. రోగులను పరామర్శించి, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

నక్కపల్లి సీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాన్ని ప్రారంభిస్తున్న హోం మంత్రి అనిత

వంద పడకలకు పెంచుతామని హోం మంత్రి అనిత హామీ

ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి

నక్కపల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామీణులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగా నక్కపల్లిలోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని త్వరలో 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. గురువారం నక్కపల్లి ఆస్పత్రిని ఆమె తనిఖీ చే శారు. రోగులను పరామర్శించి, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పలువురు బాలింతలతో మాట్లాడి, వారికి పుట్టిన శిశువులను ఎత్తుకొని ముద్దాడారు. బాలింతలకు బేబీ కిట్లు అందజేశారు. అనంతరం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాన్ని ప్రారంభించారు. ఒక బాలింతతో కలిసి వాహనంలో కోనవానిపాలెం వెళ్లి ఆమెను అక్కడ దించేసి వచ్చారు. అనంతరం ఆస్పత్రి వద్ద మంత్రి మాట్లాడుతూ, నక్కపల్లి సీహెచ్‌సీలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌తో కూడా మాట్లాడానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ సునీల్‌ సురేశ్‌ రాజు, టీడీపీ నియోజకవర్గం కన్వీనర్‌ కొప్పిశెట్టి వెంకటేశ్‌, టీడీపీ నాయకులు గింజాల లక్ష్మణరావు, అమలకంటి అబద్ధం, కురందాసు నూకరాజు, వెలగా శ్రీనివాసరావు, కొప్పిశెట్టి బుజ్జి, మున్నీసా బేగం, మేరుగు నాగేశ్వరరావు, మీగడ సత్తిబాబు, కేవీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 01:00 AM