Share News

టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:42 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి డీఈఓ జి.అప్పారావునాయుడుతో కలిసి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై నియమించిన 266 మంది అడాప్షన్‌ అధికారులతోపాటు గిరిజన, సాంఘిక, కేజీబీవీ, విద్యాశాఖ అధికారులు, అన్ని మండలాల ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌. పక్కన డీఈఓ జి.అప్పారావునాయుడు

పక్కాగా100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు

అధికారులకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం

అనకాపల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి డీఈఓ జి.అప్పారావునాయుడుతో కలిసి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై నియమించిన 266 మంది అడాప్షన్‌ అధికారులతోపాటు గిరిజన, సాంఘిక, కేజీబీవీ, విద్యాశాఖ అధికారులు, అన్ని మండలాల ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు, విద్యాప్రమాణాల మెరుగునకు చర్యలు చేపట్టాలని సూచించారు. వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులందరూ పది పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేలా ఒక ప్రణాళికతో చదివించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను తక్షణమే గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Jan 21 , 2026 | 12:42 AM