ఆర్.భీమవరంలో ఎంఎస్‌ఎంఈ పార్కు
ABN , Publish Date - May 25 , 2026 | 12:21 AM
మండలంలోని ఆర్.భీమవరంలో ఏర్పాటు కానున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు తెలిపారు.
నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
బుచ్చెయ్యపేట, మే 24 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని ఆర్.భీమవరంలో ఏర్పాటు కానున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించిన భూముల్లో చదును పనులను పరిశీలించడానికి ఆదివారం ఇక్కడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ఇక్కడ 30 ఎకరాలను కేటాయించిందని తెలిపారు. సోమవారం ఇక్కడ జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, కలెక్టర్ విజయకృష్ణన్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నదని, చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన పార్కును ఆర్.భీమవరంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కాగా ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించిన భూమిలో చదును పనులను తహశీల్దారు ఎం.లక్ష్మి, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, తదితరులు పరిశీలించారు.