ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:00 AM
జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, మండలాధ్యక్ష (ఎంపీపీ) పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
జిల్లాలో నాలుగు జడ్పీటీసీ స్థానాలు
ఆనందపురం...అన్ రిజర్వుడ్/జనరల్
భీమునిపట్నం...అన్ రిజర్వ్డ్/జనరల్ మహిళ
పద్మనాభం...బీసీ మహిళ
పెందుర్తి...బీసీ
గెజిట్ విడుదల చేసిన కలెక్టర్
ఎంపీపీ...
ఆనందపురం...బీసీ
భీమునిపట్నం...బీసీ-మహిళ
పద్మనాభం...అన్ రిజర్వ్డ్/జనరల్ మహిళ
పెందుర్తి...అన్ రిజర్వ్డ్/జనరల్
విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, మండలాధ్యక్ష (ఎంపీపీ) పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్ బుధవారం గెజిట్ విడుదల చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ సీటు బీసీ జనరల్‌కు రిజర్వు అయిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగు ఎంపీపీ, నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు.
పునర్విభజన అనంతరం విశాఖపట్నం జిల్లాలో కేవలం నాలుగు (భీమిలి, ఆనందపురం, పెదుర్తి, పద్మనాభం) మండలాలే మిగిలాయి. జడ్పీటీసీ స్థానాలను పరిశీలిస్తే...ఆనందపురం (అన్ రిజర్వ్డ్ జనరల్), భీమునిపట్నం (అన్ రిజర్వ్డ్ మహిళ), పద్మనాభం (బీసీ మహిళ), పెందుర్తి...బీసీలకు కేటాయించారు. అదేవిధంగా ఎంపీపీ...ఆనందపురం (బీసీ), భీమునిపట్నం (బీసీ-మహిళ), పద్మనాభం (అన్ రిజర్వ్డ్ మహిళ), పెందుర్తి (అన్ రిజర్వ్డ్) అయ్యాయి. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలోని 53 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
ఆనందపురం మండలంలో
ఆనందపురం మండల పరిధిలో 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఆనందపురం-1 ఎంపీటీసీ స్థానాన్ని బీసీలకు, ఆనందపురం-2 (బీసీ మహిళ), బోని (బీసీ), చందక (అన్ రిజర్వుడ్-మహిళ), గంభీరం (అన్ రిజర్వుడ్), గిడిజాల (అన్ రిజర్వుడ్-మహిళ), గొట్టిపల్లి (బీసీ మహిళ), కణమాం (బీసీ మహిళ), కుసులువాడ (బీసీ), మామిడిలోవ (బీసీ), ముచ్చెర్ల (అన్ రిజర్వుడ్-మహిళ), పాలవలస (అన్ రిజర్వుడ్), పెద్దిపాలెం (అన్ రిజర్వుడ్), శొంఠ్యాం (అన్ రిజర్వుడ్), తర్లువాడ (ఎస్సీ) వెల్లంకి (అన్ రిజర్వుడ్-మహిళ), వేములవలస (అన్ రిజర్వుడ్-మహిళ)కు కేటాయించారు.
భీమునిపట్నం మండల పరిధిలో..
భీమునిపట్నం మండల పరిధిలోని 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అమనాం (బీసీ మహిళ), అన్నవరం (అన్ రిజర్వ్డ్) చిప్పాడ (అన్ రిజర్వ్డ్-మహిళ), దాకమర్రి (అన్ రిజర్వ్డ్ మహిళ), మజ్జిపేట (బీసీ మహిళ), మజ్జివలస (అన్రిజర్వ్డ్-మహిళ), మూలకుద్దు (అన్ రిజర్వ్డ్/జనరల్), పెదనాగమయ్యపాలెం (అన్ రిజర్వుడ్/జనరల్), సింగనబండ (బీసీ -మహిళ), టి.నగరపాలెం (బీసీ) తాళ్లవలస (ఎస్సీ), తాటితూరు (బీసీ)
పద్మనాభం మండలంలో..
పద్మనాభం మండల పరిధిలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో అనంతవరం (బీసీ) అయినాడ (అన్ రిజర్వ్డ్/జనరల్), బందేవుపురం (ఎస్సీ మహిళ), బీఆర్ తాళ్లవలస (అన్ రిజర్వ్డ్ మహిళ), గంధవరం (అన్రిజర్వ్డ్ మహిళ), కోరాడ (బీసీ మహిళ), కొవ్వాడ (అన్రిజర్వ్డ్ మహిళ), కృష్ణాపురం (అన్ రిజర్వ్డ్/జనరల్) మద్ది (అన్ రిజర్వ్డ్), పాండ్రంగి-1 (బీసీ) పాండ్రంగి 2 (బీసీ), పొట్నూరు (ఎస్సీ), రెడ్డిపల్లి (అన్ రిజర్వ్డ్), రేవిడి (అన్ రిజర్వ్డ్ మహిళ), తునివలస (బీసీ మహిళ).
పెందుర్తి మండలంలో..
పెందుర్తి మండల పరిధిలో తొమ్మిది ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. వీటిలో గోరపల్లి (బీసీ మహిళ), సారిపల్లి (బీసీ మహిళ), రాజయ్యపేట (అన్ రిజర్వ్డ్/జనరల్) పినగాడి (అన్రిజర్వ్డ్ మహిళ), రామాపురం (అన్ రిజర్వ్డ్), గుర్రంపాలెం (బీసీ) పెదగాడి (అన్రిజర్వ్డ్ మహిళ), వాలిమెరక (ఎస్సీ), ఎస్.ఆర్.పురం (బీసీ)కు కేటాయించారు.
మోదం...ఖేదం
వార్డు రిజర్వేషన్లపై
మాజీ కార్పొరేటర్లలో భిన్నాభిప్రాయాలు
అవకాశం ఇస్తే మేయర్‌గానే పోటీ చేయాలని భావిస్తున్న మాజీ మేయర్ హరివెంకటకుమారి
రిజర్వేషన్లు అనుకూలించక మాజీ డిప్యూటీ మేయర్ సతీష్, వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల పోటీకి దూరం
96వ వార్డు నుంచి గంధం, 83వ వార్డు నుంచి పల్లా, 52వ వార్డు నుంచి జియ్యాని బరిలోకి...
విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):
గత కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న పలువురు మరోమారు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అదేసమయంలో రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో మరికొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు.
గత కౌన్సిల్లో మేయర్‌గా పనిచేసిన గొలగాని హరివెంకటకుమారి ఈసారి ఎన్నికల్లో అవకాశం వస్తే మేయర్‌గా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి ఆమె విముఖత వ్యక్తంచేస్తున్నారు. వైసీపీ నేతలు కార్పొరేటర్ పదవికి ఆమె పేరును ప్రతిపాదనలోకి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఈ సారి పోటీకి దూరంగానే ఉండిపోయే అవకాశం ఉంది. గత కౌన్సిల్లో చివరి ఏడాది కాలం మేయర్‌గా పనిచేసిన పీలా శ్రీనివాసరావుకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆయన పోటీకి దూరంగా ఉండనున్నారు. అలాగే గత కౌన్సిల్లో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా బాణాల శ్రీనివాసరావు పనిచేశారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన వార్డులో గల ప్రాంతాలు 46,47,48 వార్డుల్లో కలిశాయి. వాటిలో ఏదో ఒకచోటనుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. కానీ అనూహ్యంగా మూడు వార్డులు బీసీ మహిళలకు రిజర్వు అయ్యాయి. దాంతో ఆయన పోటీకి దూరంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే గత కౌన్సిల్లో డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన కట్టమూరి సతీష్ ఈసారి 55వ వార్డు నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ వార్డు బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆయన పోటీకి అవకాశం లేకుండాపోయింది. గత కౌన్సిల్లో మరో డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జియ్యాని శ్రీధర్ గతంలో కార్పొరేటర్‌గా గెలిచిన 42వ వార్డు ప్రస్తుతం 52వ వార్డుగా మారడంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లుచేసుకుంటూ వచ్చారు. ఆ వార్డు జనరల్‌కు కేటాయించడంతో అక్కడి నుంచే పోటీకి దిగుతున్నట్టు ప్రకటించారు. అప్పట్లో 76వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన గంథం శ్రీనివాసరావు గత కౌన్సిల్లో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. పునర్విభజన నేపథ్యంలో ఆయన 96వ వార్డులోకి మారారు. ఆ వార్డు జనరల్ కేటగిరీకి రిజర్వు చేయడంతో అక్కడి నుంచి పోటీకి దిగుతున్నట్టు ప్రకటించారు. 67వ వార్డు కార్పొరేటర్‌గా గెలిచి టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం 83వ వార్డు నుంచి పోటీకి దిగాలని నిర్ణయించారు.