Share News

భోగాపురంలో ప్రత్యేక విమానాల రాకపోకలు

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:10 AM

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

భోగాపురంలో ప్రత్యేక విమానాల రాకపోకలు

విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పౌర విమానాల రాకపోకలను ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభిస్తామని జీఎంఆర్‌ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఒకటో తేదీనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులు ప్రత్యేక విమానాల్లో వచ్చి వెళ్లారు. ఇప్పుడు కూడా అలాంటి సర్వీసులు నడుస్తున్నాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు మిత్రులతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. అదే సమయంలో మరో ప్రత్యేక విమానంలో వెళ్లడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, తదితరులు వారిని కలిసి మాట్లాడారు.

Updated Date - Aug 13 , 2026 | 01:10 AM