నేడు పాడేరులో మోదకొండమ్మ తీర్థం
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:15 PM
గిరిజన ప్రాంత ప్రజల ఇలవేల్పు మోదకొండమ్మ తీర్థానికి పాడేరు ముస్తాబైంది. ఆదివారం వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ముస్తాబైన ఆలయం
పాడేరురూరల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత ప్రజల ఇలవేల్పు మోదకొండమ్మ తీర్థానికి పాడేరు ముస్తాబైంది. ఆదివారం వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం శనివారం సాయంత్రానికి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి విగ్రహానికి, ఆలయానికి విద్యుత్ అలంకరణ పనులు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ తెలిపారు. మధ్యాహ్నం అన్నసమారాధన ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి అమ్మవారిని నేల డ్యాన్స్‌లు, తీన్‌మార్ బ్యాండ్, బాణసంచాలతో భారీ ఊరేగింపు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాత్రికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు కోటిబాబు నాయుడు తెలిపారు.