మోదకొండమ్మ ఆలయం కిటకిట
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:15 PM
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది.
పాడేరురూరల్, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొనేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అలాగే పాడేరు ఘాట్‌లోని మోదాపల్లి జంక్షన్ వద్ద గల అమ్మవారి పాదాలను కూడా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.