ప్రధాని సభకు ప్రజల తరలింపు
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:49 AM
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రజలను తరలించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్, పలు శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్‌లో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజలను భోగాపురం తరలించడానికి అవసరమైన బస్సులు, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, వైద్య సహాయం, ఇతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అన్నారు.
నిర్ణీత వేళలకు బస్సులు బయలుదేరాలి
ప్రతి బస్సులో మెడికల్ కిట్, ఏఎన్‌ఎం
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
అనకాపల్లి కలెక్టరేట్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రజలను తరలించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్, పలు శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్‌లో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజలను భోగాపురం తరలించడానికి అవసరమైన బస్సులు, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, వైద్య సహాయం, ఇతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అన్నారు. మండలాల వారీగా బస్సుల కేటాయింపు, బయలుదేరే సమయాలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. బస్సులన్నీ నిర్ణీత వేళలకు ఆయా ప్రదేశాలకు చేరేలా సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్‌తోపాటు ఒక ఏఎన్‌ఎం లేదా ఆశా కార్యకర్త వుండాలని స్పష్టం చేశారు. బస్సుల్లో వెళ్లే వారికి తాగునీటి బాటిళ్లతోపాటు ఉదయం పులిహోర, బిస్కెట్లు, అరటిపండ్లు, మధ్యాహ్న భోజనంగా వెజ్ బిర్యానీ, మజ్జిగను అందజేయాలని స్పష్టం చేశారు. అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ముగ్గురేసి ఉద్యోగులతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి బస్సుల కదలికలను పర్యవేక్షించాలని కలెక్టర్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.