భోగాపురం సభకు 50 వేల మంది సమీకరణ
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:29 AM
వచ్చే నెల ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్రధాని సరేంద్రమోదీ సభకు జిల్లా నుంచి 50 వేల మందిని సమీకరించనున్నారు.
1,300 బస్సులు ఏర్పాటు
విశాఖపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్రధాని సరేంద్రమోదీ సభకు జిల్లా నుంచి 50 వేల మందిని సమీకరించనున్నారు. లక్ష మందితో ప్రధాని సభ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 50 వేలమంది, విశాఖ జిల్లా నుంచి 50 వేల మందిని తరలించేందుకు మూడు జిల్లాల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా నుంచి జనాలను తరలించడానికి 400 ఆర్టీసీ బస్సులు, 900 ప్రైవేటు బస్సులు సమకూర్చనున్నారు. నగరంతోపాటు భీమిలి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి జనాలను తరలించేందుకు ప్రాంతాల వారీగా అధికారులను నియమించారు.