Share News

రైల్వే ఫ్లైఓవర్‌ భూ సమస్యపై ఎమ్మెల్యే ఆరా

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:09 AM

స్థానిక లక్ష్మీదేవిపేట, రైల్వేస్టేషన్‌ రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఫ్లైఓవర్‌ వంతెన పనులు కొన్నేళ్లుగా ముందుకు సాగని విషయం తెలిసిందే.

రైల్వే ఫ్లైఓవర్‌ భూ సమస్యపై ఎమ్మెల్యే ఆరా
రైల్వే ఫ్లైఓవర్‌ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

లక్ష్మీదేవిపేటలో పర్యటించిన కొణతాల రామకృష్ణ

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక లక్ష్మీదేవిపేట, రైల్వేస్టేషన్‌ రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఫ్లైఓవర్‌ వంతెన పనులు కొన్నేళ్లుగా ముందుకు సాగని విషయం తెలిసిందే. ఇక్కడ నెలకొన్న భూ సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో ఆయన పర్యటించారు. వంతెనకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించి, దీని నిర్మాణం కోసం ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ఎంత మేరకు అవసరమో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీవో షేక్‌ ఆయీషా, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కె.చక్రవర్తి, పలువురు అధికారులు వున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 01:09 AM