ఫిల్మ్‌నగర్ క్లబ్ గౌరవ చైర్మన్‌గా ఎమ్మెల్యే గంటా
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:55 AM
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ సెంటర్ గౌరవ చైర్మన్‌గా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సెంటర్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. సెంటర్ సొంత భవనానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి, అందులోనే నిర్మాణం చేపడతామని గంటా ప్రకటించారు. ఈ క్లబ్ నగరంలోని వాల్తేరు క్లబ్, గోల్ఫ్ క్లబ్‌లకు దీటైన ప్రమాణాలు పాటించాలన్నారు. కొత్త అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఈ సెంటర్ స్థాయిని పెంచడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
కొత్త కార్యవర్గం
ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీకి ఉపాధ్యక్షుడిగా ఆర్‌వీ చంద్రమౌళి, కార్యదర్శిగా జాస్తి శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా ఈ.అశోక్‌కుమార్, కోశాధికారిగా ఎస్.ఆర్.కె.రెడ్డి, సభ్యులుగా జీఎస్‌ఎస్‌ఎన్ రాజు, ఎల్‌ఎస్‌ఎన్ రాజు, బీఎన్‌వీ మణికంఠ, కె.వెంకటేశ్వరరావు, ఎ.కాశీవిశ్వేశ్వరరావు, వి.వెంకటపతిరాజు, పి.వెంకటబాబు, వి.వి.మహేశ్వరరెడ్డి, ఎస్.సూర్యనారాయణరాజు, కె.నరేంద్రకుమార్ ఎన్నికయ్యారు.