అనంతగిరి ఎంపీపీగా తడబారికి మితుల
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:35 AM
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ ఎన్నిక జరిగింది. ప్రిసైడింగ్ అధికారి ఏపీసీ స్వామినాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఎన్నికలో వైసీపీ తరఫున చిలకలగెడ్డ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన తడబారికి మితులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఏకగ్రీవంగా ఎన్నిక
అనంతగిరి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ ఎన్నిక జరిగింది. ప్రిసైడింగ్ అధికారి ఏపీసీ స్వామినాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఎన్నికలో వైసీపీ తరఫున చిలకలగెడ్డ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన తడబారికి మితులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 14 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 9 మంది మాత్రమే ఎన్నికలో పాల్గొన్నారు. తడబారికి మితులను ఎంపీపీగా కెలాయి తౌటినాయుడు ప్రతిపాదించగా, శోభ జయశ్రీ బలపరచడంతో పోటీలో ఎవరూ లేకపోవడం వలన తడబారికి మితుల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ఏపీసీ స్వామినాయుడు ప్రకటించారు. అయితే ఆమె వైసీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచినప్పటికీ, పార్టీకి సంబంధించి ఎంపీపీ అభ్యర్థిగా బీఫారం ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకున్నామని, ఇదే నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని ప్రిసైడింగ్ అధికారి తెలిపారు.