Share News

28న ఆదివాసీ సంఘాలతో మంత్రులు అనిత, సంధ్యారాణి భేటీ

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:58 PM

రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖాల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈనెల 28న ఆదివాసీ సంఘాలతో పాడేరులో భేటీ కానున్నారు.

28న ఆదివాసీ సంఘాలతో  మంత్రులు అనిత, సంధ్యారాణి భేటీ

గిరిజన సమస్యలపై అభిప్రాయాల సేకరణ

పాడేరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖాల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈనెల 28న ఆదివాసీ సంఘాలతో పాడేరులో భేటీ కానున్నారు. గిరిజన సమస్యలు జీవో 3 పునరుద్ధరణ, 1/70 చట్టపరిరక్షణ అంశాలపై ఇటీవల ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయా సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు వాటిపై ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో చర్చించేందుకు మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి 28న కలెక్టరేట్‌కు సమీపంలోని ఎస్‌ఆర్‌.శంకరణ్‌ ఆడిటోరియంతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, వివిధ శాఖల అధికారులు హాజరవుతారు.

Updated Date - Jul 25 , 2026 | 11:58 PM