నేడు మంత్రి నారా లోకేశ్ రాక
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:45 AM
రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శనివారం జిల్లాకు రానున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో రూ.2300 కోట్లతో బ్లూ జెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీ భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. శుక్రవారం రాత్రి విశాఖ చేసుకున్న ఆయన నగరంలోని టీడీపీ కార్యాలయంలో బసచేశారు.
అచ్యుతాపురం సెజ్‌లో బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఫార్మాకు శంకుస్థాపన
రూ.2,300 కోట్ల పెట్టుబడి
మూడు దశల్లో నిర్మాణం
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు వేల మందికి ఉపాధి
అనకాపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శనివారం జిల్లాకు రానున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో రూ.2300 కోట్లతో బ్లూ జెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీ భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. శుక్రవారం రాత్రి విశాఖ చేసుకున్న ఆయన నగరంలోని టీడీపీ కార్యాలయంలో బసచేశారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 10.30 గంటలకు సెజ్‌లోని రాంబిల్లి మండలం సీతపాలెం చేరుకుంటారు. ఇక్కడ 102.48 ఎకరాల్లో సుమారు రూ.2,300 కోట్ల పెట్టుబడితో నిర్మించే బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఫార్మా కంపెనీకి శంకుస్థాపన చేస్తారు. మూడు దశల్లో దీనిని నిర్మించనున్నారు మొదటి దశ 2027కు, రెండో దశ ఏప్రిల్ 2030కి, మూడో దశ అక్టోబరు 2031కి పూర్తి అవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్ కంపెనీ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 3.15 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.
బ్లూ జెట్ ఫార్మా భూమి పూజకు ఏర్పాట్లు పూర్తి
రాంబిల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం సమీపంలో రూ.2,300 కోట్లతో ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా కంపెనీ భూమి పూజ, శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరుకానునుండడంతో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు సీఐలు నరసింగరావు, చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను అదనపు ఎస్పీ (అడ్మిన్) దేవప్రసాద్, పరవాడ డీఎస్పీ మోహనరావు పరిశీలించారు. వాహనాల పార్కింగ్, వీఐపీల రాకపోకల మార్గాలు, వేదిక భద్రత, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖలు హాజరు కానున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.