ఘనంగా మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:40 AM
రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించారు. గ్రామ, మండల, జిల్లా పార్టీ కార్యాలయాల్లో కేకులు కట్ చేసి, మిఠాయిలు పంచారు. ఆలయాల్లో లోకేశ్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. టీడీపీ శ్రేణులు రక్తదానం చేశారు. గ్రామాల్లో ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ
టీడీపీ శ్రేణుల రక్తదానం
అనకాపల్లి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించారు. గ్రామ, మండల, జిల్లా పార్టీ కార్యాలయాల్లో కేకులు కట్ చేసి, మిఠాయిలు పంచారు. ఆలయాల్లో లోకేశ్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. టీడీపీ శ్రేణులు రక్తదానం చేశారు. గ్రామాల్లో ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. అనకాపల్లిలో టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన లోకేశ్ జన్మదిన వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొని కేక్ కట్ చేశాఆరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడేందుకు నారా లోకేశ్ యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి కూటమి అధికారంలోకి రావడంతో తీవ్రంగా కృషిచేశారని కొనియాడారు. ఏడాదిన్నర పాలనలోనే తండ్రి చంద్రబాబుకు తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారని అన్నారు. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, పలు రకాల పరిశ్రమలను తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి లోకేశ్ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, నీలబాబు, డాక్టర్ నారాయణరావు తదితర నేతలతో కలిసి ఎన్టీఆర్ ఆస్పత్రిలో రోగులు, గర్భిణులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.