ఘనంగా మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Jan 23 , 2026 | 10:41 PM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
పాడేరు, అరకులోయల్లో సందడిగా నిర్వహణ
పాడేరులో మెడికల్ క్యాంప్, రక్తదానం శిబిరం ఏర్పాటు
ఆస్పత్రుల్లో రోగులకు పాలు రొట్టెలు పంపిణీ ,
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరులో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో కేక్‌ను కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ప్రత్యేక వైద్య, రక్తదానం శిబిరాలు నిర్వహించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేసి, భోజనాలు ఏర్పాటు చేశారు. హుకుంపేట మండలం మత్స్యపురం పంచాయతీ ఉప్ప గ్రామంలో మహిళలకు చీరలను పంపిణీ, అన్నసమారాధన నిర్వహించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో స్థానిక మోదకొండమ్మ ఆలయంలో మంత్రి నారా లోకేశ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. అలాగే మాజీ మంత్రి మణికుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు, టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకటరమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు పాలు, రొట్టెలు, పేదలకు చీరలను పంపిణీ చేశారు. అలాగే అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్టీసీ విజయనగరం రీజనల్ చైర్మన్ దొన్నుదొర ఆధ్వర్యంలో మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.