మంత్రి లోకేశ్ రాక
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:09 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు.
పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ
విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, మేయర్ పీలా శ్రీనివాస్, పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్, మాజీ అధ్యక్షుడు గండి బాబ్జీ, తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రజల నుంచి మంత్రి లోకేశ్ వినతిపత్రాలు స్వీకరించారు. కార్యాలయంలోనే రాత్రి బస చేశారు. బుధవారం 12వ అదనపు మెట్రోపాలిటన్ జడ్జి కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. తనపై ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన కథనంపై ఆయన గతంలో పరువునష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఇక్కడి 12వ అడిషనల్ జిల్లా జడ్జి కోర్టులో జరుగుతోంది. ఆయన ఇప్పటికి రెండుసార్లు ఈ కేసు విచారణకు హాజరయ్యారు.