Share News

మేయర్‌ శ్రావణికి మంత్రి లోకేశ్‌ పరామర్శ

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:29 AM

నగర మేయర్‌ ముక్కా శ్రావణి, ఆమె కుటుంబ సభ్యులను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం పరామర్శించారు.

మేయర్‌ శ్రావణికి మంత్రి లోకేశ్‌ పరామర్శ

మాజీ కార్పొరేటర్‌ ముత్యాలనాయుడుకు నివాళులు

అక్కయ్యపాలెం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):

నగర మేయర్‌ ముక్కా శ్రావణి, ఆమె కుటుంబ సభ్యులను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం పరామర్శించారు. ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్‌ ముక్కా ముత్యాలనాయుడు శుక్రవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సోమవారం శాంతిపురంలోని ముత్యాలనాయుడు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముత్యాలనాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్‌గా, జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షునిగా ముత్యాలనాయుడు ప్రజలకు, పార్టీకి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆయన వెంట ఎంపీ శ్రీభరత్‌, ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు, టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పట్టాభి, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీ, తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 01:29 AM