Share News

నగరానికి మంత్రి లోకేశ్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:18 AM

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధిశాఖా మంత్రి నారా లోకేశ్‌ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు.

నగరానికి మంత్రి లోకేశ్‌

ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన పార్టీ నాయకులు

గోపాలపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధిశాఖా మంత్రి నారా లోకేశ్‌ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి, నేతలు దాడి వీరభద్రరావు, దువ్వారపు రామారావు, గండి బాబ్జీ, గిడ్డి ఈశ్వరి, బుద్దా నాగజగదీశ్‌, చింతకాయల విజయ్‌, బండారు అప్పలనాయుడు, పీలా శ్రీనివాస్‌, అక్కరమాని విజయనిర్మల, పీవీజీ కుమార్‌, గొంప కృష్ణ, కోరాడ రాజబాబు తదితర నేతలు స్వాగతం పలికారు. కాగా మంత్రి ఎయిర్‌పోర్టు పోర్టికో వద్ద పలువురి నుంచి వినతులు స్వీకరించారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న లోకేశ్‌ అక్కడే బస్సులో రాత్రి బసచేస్తారు. సోమవారం ఉదయం టీడీపీ కార్యాలయంలో శెట్టిబలిజ నేత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభలో లోకేశ్‌ పాల్గొంటారు. అనంతరం సాలిగ్రాంపురంలో ఇనార్బిట్‌మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. ఆ తరువాత అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌ ఉక్కు కర్మాగార శంకుస్థాపనకు హాజరవుతారు.

Updated Date - Mar 23 , 2026 | 01:18 AM