Share News

నూకాంబిక సన్నిధిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ABN , Publish Date - Aug 27 , 2026 | 01:18 AM

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు స్థానిక నూకాంబిక అమ్మవారిని బుధవారం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి దంపతులకు ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్‌, వేదపండితులతో స్వాగతం పలికారు.

నూకాంబిక సన్నిధిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్‌ దంపతులు

- అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు స్థానిక నూకాంబిక అమ్మవారిని బుధవారం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి దంపతులకు ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్‌, వేదపండితులతో స్వాగతం పలికారు. మంత్రి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. గర్భగుడిలోని అమ్మవారిని మంత్రి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ మండపంలో మంత్రి దంపతులను వేదపండితులు ఆశీర్వాదం చేసిన తరువాత చైర్మన్‌, ఈవోలు మంత్రి దంపతులను సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 01:18 AM