పెరుగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:18 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. కానీ పొగమంచు మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు.
అరకులోయలో 15.9 డిగ్రీలు
పాడేరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. కానీ పొగమంచు మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. అయితే ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రంగానే కాసింది. కాగా మంగళవారం అరకులోయలో 15.9, ముంచంగిపుట్టులో 16.0, పెదబయలులో 18.1, చింతపల్ల్లిలో 18.7, జి.మాడుగులలో 19.3, అనంతగిరిలో 20.1, కొయ్యూరులో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.