సీలేరులో రోజుకి మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి
ABN , Publish Date - Jan 16 , 2026 | 10:57 PM
సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో రోజుకు ఒక మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేస్తున్నామని ఏపీ జెన్‌కో ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
డొంకరాయి నుంచి మూడు వేల క్యూసెక్కులు విడుదల
సీలేరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో రోజుకు ఒక మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేస్తున్నామని ఏపీ జెన్‌కో ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి పవర్‌కెనాల్ నిర్వహణ పనుల్లో భాగంగా డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాల్లో ఇటీవల విద్యుదుత్పత్తిని నిలిపివేశామన్నారు. అందువల్ల సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోనే గ్రిడ్ అధికారుల ఆదేశాల మేరకు నాలుగు యూనిట్లల్లో మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తిని చేస్తున్నామన్నారు. సీలేరులో విద్యుదుత్పత్తి అనంతరం విడుదలయ్యే నీటితో డొంకరాయి జలాశయ నీటిమట్టం 1035 అడుగులకు చేరుకుందన్నారు. జలాశయం ప్రమాద స్థాయికి (1037 అడుగులకు) చేరకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గత వారం రోజులుగా మూడు గేట్లు ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు.