ఎలమంచిలిలో స్వల్పంగా భూ ప్రకంపనలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:50 AM
ఎలమంచిలిలో స్వల్పంగా భూ ప్రకంపనలు
ఎలమంచిలి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు నుంచి ఐదు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించినట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. జలాలు వీధి, పెదపల్లి రోడ్డు, పాతవీధి, ఎల్‌ఐసీ కార్యాలయం రోడ్డు ప్రాంతాల్లో సుమారు 5.05 గంటల సమయంలో భూమి కంపినట్టు తెలిసింది. భూమి కంపించిన తన ఇంటి కిచెన్‌లో కొన్ని వస్తువులు కిందపడిపోయినట్టు జలాలు వీధిలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి ఒకరు చెప్పారు. అయితే భూ ప్రకంపనలు వచ్చిన సమయంలో చాలా మంది నిద్రలో వుండడంతో ఈ విషయం కొద్ది మందికి మాత్రమే తెలిసింది. మార్నింగ్ వాక్‌తోపాటు ఇతర అవసరాల నిమిత్తం బయటకు వచ్చిన వారు.. భూ ప్రకంపనాలను పరిశీలించారు. ఉదయం నిద్రలేచిన తరువాత కొందరు చెబితే తప్ప చాలా మందికి భూకంపం గురించి తెలియలేదు. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.5గా నమోదైనట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.