దేశవ్యాప్త సమ్మెలో భోజన పథకం కార్మికులు
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:34 AM
పాఠశాలల మధ్యాహ్న భోజన పఽథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని, భోజన పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నట్టు పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి తెలిపారు.
జిల్లా విద్యా శాఖ అధికారులకు నోటీసు
చోడవరం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):
పాఠశాలల మధ్యాహ్న భోజన పఽథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని, భోజన పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నట్టు పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి తెలిపారు. ఈ మేర కు సోమవారం ఆమె జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అధికారులకు సమ్మె నోటీసు అందించారు. అనంతరం వరలక్ష్మి మాట్లాడుతూ, భోజన పథకం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సూర్యలక్ష్మి, నాయకులు ఎం.శ్రీదేవి, జానకి, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.