Share News

ఎలమంచిలిలో మెగా వాటర్‌ స్కీమ్‌

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:53 AM

ఎలమంచిలి మునిసిపాలిటీ ప్రజలకు పుష్కలంగా తాగునీటిని సరఫరా చేయడానికి రూ.120.18 కోట్లతో నిర్మించనున్న సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పఽథకానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ ఆదివారం ఇక్కడ శంకుస్థాపన చేశారు. దీంతోపాటు అమృత్‌ 2.0 కింద రూ.7.82 కోట్లతో చేపట్టనున్న నీటి సరఫరా అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు.

ఎలమంచిలిలో మెగా వాటర్‌ స్కీమ్‌
సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పఽథకం పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌

శంకుస్థాపన చేసిన ఎంపీ రమేశ్‌, ఎమ్మెల్యే సుందరపు

ఎలమంచిలి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపాలిటీ ప్రజలకు పుష్కలంగా తాగునీటిని సరఫరా చేయడానికి రూ.120.18 కోట్లతో నిర్మించనున్న సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పఽథకానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ ఆదివారం ఇక్కడ శంకుస్థాపన చేశారు. దీంతోపాటు అమృత్‌ 2.0 కింద రూ.7.82 కోట్లతో చేపట్టనున్న నీటి సరఫరా అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపీ రమేశ్‌ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో పలు భారీ, మధ్యతరహా పరిశ్రమలు, డేటా సెంటర్లను ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. వీటిల్లో ఎక్కువగా ఎలమంచిలి నియోజకవర్గంలోనే ఏర్పాటవుతున్నాయని, అందువల్ల ఇక్కడి యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌, కూటమి పార్టీల నాయకులు, మునిసిపల్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిపి పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Aug 10 , 2026 | 12:54 AM