Share News

అరకు ఏరియా ఆసుపత్రిలో వైద్య శాఖ బృందం సందర్శన

ABN , Publish Date - Nov 06 , 2026 | 10:53 PM

రకులోయ ఏరియా ఆస్పత్రిని శుక్రవారం రాష్ట్రస్థాయి వైద్యా శాఖ బృందం సందర్శించింది.

 అరకు ఏరియా ఆసుపత్రిలో వైద్య శాఖ బృందం సందర్శన
అరకులోయ ఆస్పత్రిని పరిశీలిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ బృందం

అన్ని వార్డులు, విభాగాల పరిశీలన

వివిధ విభాగాలు, పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రశంసలు

అరకులోయ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): అరకులోయ ఏరియా ఆస్పత్రిని శుక్రవారం రాష్ట్రస్థాయి వైద్యా శాఖ బృందం సందర్శించింది. ఏపీ నేషనల్‌ హెల్త్‌ ప్రోగ్రాం (ఎన్‌హెచ్‌ఎం) జాయింట్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌) డి.ప్రకాశరావు, రాష్ట్ర ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఎల్‌.దేవి, ట్రైనింగ్‌ కన్సల్టెంట్‌ ఎ.వాసుబాబుల బృందం ఆస్పత్రిలో అన్ని విభాగాలు, వార్డులు, ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలోని వార్డులు, ప్రసూతి గది, ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబొరేటరీ (ఐఫిహెచ్‌ఎల్‌), స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యునిట్‌ (ఎస్‌ఎన్‌సియూ), ఆయూష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎం) రిజిస్ట్రేషన్‌ విభాగం, ఫార్మసీ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం ప్రతి విభాగంలో అందిస్తున్న వైద్య సేవలు, నిర్వహణ, పారిశుధ్యం, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వివిధ అభివృద్ధి పనుల పురోగతిని బృందం సమీక్షించింది. ఆస్పత్రిలో అన్ని విభాగాల పనితీరును జిల్లా వైద్య విధానపరిషత్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ లగుడు రాము బృంద సభ్యులకు వివరించారు. ముఖ్యంగా ఆస్పత్రిలో పారిశుధ్యం, పరిశుభ్రతపై రాష్ట్ర స్థాయి వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందిని అభినందించింది. వారి వెంట జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి రియాజ్‌భేగ్‌, ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ శివబాలాజీ, అనస్టీయాలజిస్టు డాక్టరు అప్పారావు, గైనకాలజిస్టు డాక్టర్‌ శోభారాణి ఉన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 10:54 PM