యథేచ్ఛగా మాంసం, చేపల విక్రయాలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:45 AM
గణతంత్రం దినోత్సవం సందర్భంగా మాంసం, చేపల అమ్మకాలు జరపకూడదన్న అధికారుల ఆదేశాలను పలుచోట్ల వ్యాపారులు బేఖాతరు చేశారు.
గణతంత్ర దినోత్సవం అయినా మూతపడని షాపులు
అధికారుల ఆదేశాలు బేఖాతరు
మాడుగుల/ కృష్ణాదేవిపేట, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):
గణతంత్రం దినోత్సవం సందర్భంగా మాంసం, చేపల అమ్మకాలు జరపకూడదన్న అధికారుల ఆదేశాలను పలుచోట్ల వ్యాపారులు బేఖాతరు చేశారు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా చికెన్, మటన్, చేపల దుకాణాలను తెరిచి, వ్యాపారం సాగించారు. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో సోమవారం సంత రోజు కావడంతో మొత్తం 14 మాంసం దుకాణాలకుగాను 12 దుకాణాలను తెరిచారు. వీటికితోడు చేపల అమ్మకాలు కూడా జరిగాయి. మద్యం షాపులను తెరవనప్పటికీ.. బెల్టు షాపుల్లో మద్యం విక్రయించారు. ఇక మాడుగులలో సైతం మాంసం వ్యాపారులు నిబంధనలకు తూట్లు పొడిచారు.
ఇక మాడుగులలో సైతం మాంసం, చేపల విక్రయాలు జోరుగా సాగాయి. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాంసం దుకాణాలను తెరవద్దని ఆదివారం పంచాయతీ అధికారులు ప్రకటించారు. కానీ వ్యాపారులు పట్టించుకోలేదు. చికెన్, మటన్ దుకాణాలు తెరిచినట్టు సమాచారం రావడంతో పంచాయతీ కార్యదర్శి నాయుడు వెళ్లి షాపులను మూయించారు. అయితే అప్పటికే చాలా వరకు అమ్మకాలు జరిగాయి. ఎస్‌ఐ నారాయణరావు ఆయా వ్యాపారులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ వీరిపై చట్టప్రకారం ఎటువంటి చర్యలు చేపట్టపోవడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.