Share News

తాజంగి జలాశయం అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:43 AM

మండలంలోని తాజంగి జలాశయం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పెషల్‌ మైనర్‌ ఇరిగేషన్‌ (ఎస్‌ఎంఐ) ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎం.రాజేంద్రకుమార్‌ తెలిపారు.

తాజంగి జలాశయం అభివృద్ధికి చర్యలు
జలాశయం భద్రతను పరిశీలిస్తున్న నిపుణుల బృందం

ఎస్‌ఎంఐ ఈఈ రాజేంద్రకుమార్‌

చింతపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి జలాశయం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పెషల్‌ మైనర్‌ ఇరిగేషన్‌ (ఎస్‌ఎంఐ) ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎం.రాజేంద్రకుమార్‌ తెలిపారు. మంగళవారం తాజంగి జలాశయాన్ని రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్లతో కూడిన నిపుణుల బృందం సందర్శించింది. జలాశయం రక్షణ చర్యలను నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ సందర్భంగా రాజేంద్రకుమార్‌ మాట్లాడుతూ రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్లు చిట్టిబాబు, ఎంటీ రాజు, పోలేశ్వరరావులు జలాశయం ఆయకట్టు, స్లూయిస్‌ గేట్లు, సర్‌ప్లస్‌ వైర్‌లను పరిశీలించి జలాశయం రక్షణకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. జలాశయం భద్రతలో భాగంగా తీసుకోవాల్సిన సాంకేతిక అంశాలను నిర్దేశించారన్నారు. జలాశయం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జలాశయం దిగువనున్న ప్రతి పంట పొలానికి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఆర్‌.రాజేశ్వరరావు, ఏఈఈ కె.నరేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:43 AM