Share News

దోమల నివారణకు చర్యలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:01 AM

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా గురువారం గన్నెల పీహెచ్‌సీ ఆవరణలో జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

దోమల నివారణకు చర్యలు
ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఎంవో తులసి, తదితరులు

అధికారులకు ఐటీడీఏ పీవో ఆదేశం

అరకులోయ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా గురువారం గన్నెల పీహెచ్‌సీ ఆవరణలో జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే దోమలను అరికట్టాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూసుకునేలా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పలువురు ఆశా కార్యకర్తలు, విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ మురళీకృష్ణ, మలేరియా సిబ్బంది, గన్నెల పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:01 AM