Share News

అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గరిష్ఠ ధరలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 10:08 PM

ఆదివాసీలు పండించిన, సేకరించిన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గరిష్ఠ ధరలు అందిస్తున్నట్టు గిరిజన సహకార సంస్థ స్థానిక బ్రాంచిమేనేజర్‌ చల్లంగి సుగునాథం అన్నారు.

అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గరిష్ఠ ధరలు

జీసీసీ మేనేజర్‌ సుగునాథం

చింతపల్లి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి):ఆదివాసీలు పండించిన, సేకరించిన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గరిష్ఠ ధరలు అందిస్తున్నట్టు గిరిజన సహకార సంస్థ స్థానిక బ్రాంచిమేనేజర్‌ చల్లంగి సుగునాథం అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మార్కెట్‌ ఆధారంగా అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పెంచుతూ రైతులకు గిట్టుబాటు కల్పిస్తున్నామన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఎండు పసుపు కిలో రూ.115, రాజ్‌మా రెడ్‌ రూ.90, రాగి రూ.32, ఎండు మిర్చి రూ.160 ధరలు కల్పిస్తున్నామన్నారు. అటవీ ఉత్పత్తులు పిక్క తీయని చింతపండు కిలో రూ.36, పిక్కతీసింది కిలో రూ.67, తూనికాయలు రూ.18, సీకాకాయ రూ.35, అడవి తేనె రూ.250, పెట్టెతేనె రూ.160, కొండచీపుర్లు గ్రేడ్‌-1 రూ.45, గ్రేడ్‌-2 40, గ్రేడ్‌-35, ఉసిరి పప్పు రూ.90, మారేడుగడ్డలు రూ.450 ధరలకు కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను జీసీసీకి విక్రయించి అధిక ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ సీనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 10:08 PM