Share News

వైభవంగా మత్స్యగుండం శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:32 PM

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో శనివారం మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

వైభవంగా మత్స్యగుండం శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
మత్స్యలింగేశ్వరస్వామిని దర్శించుకుంటున్న భక్తులు

ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో లోకేశ్వరరావు

పాడేరురూరల్‌/హుకుంపేట, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో శనివారం మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మత్స్యగుండంలో మత్స్యాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. శనివారం మత్స్యగుండం వద్ద ఆర్డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు ఏర్పాట్లును పరిశీలించారు. సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లు, ప్రభుత్వ స్టాల్స్‌, ప్రత్యేక వైద్య శిబిరాలు, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశాల మేరకు జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 11:32 PM