మార్కెట్లకు దసరా శోభ
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:21 AM
విజయదశమిని పురస్కరించుకుని జిల్లాలోని మార్కెట్లు సోమవారం కిటకిటలాడాయి. పాడేరు, అరకులోయ మార్కెట్లలో సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంది.
పూజా సామగ్రి కొనుగోళ్లతో రద్దీ
పాడేరురూరల్/అరకులోయ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): విజయదశమిని పురస్కరించుకుని జిల్లాలోని మార్కెట్లు సోమవారం కిటకిటలాడాయి. పాడేరు, అరకులోయ మార్కెట్లలో సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంది. మంగళవారం దసరా కావడంతో అమ్మవారికి, వాహనాలకు పూజలు చేసేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో జనం మార్కెట్లకు వచ్చారు. అయితే కొబ్బరికాయ, అరటిపండ్లు, పూలు, వాహన అలంకరణ సామగ్రి ధరలు ఆకాశాన్న ంటాయి. సాధారణ రోజుల్లో రూ.25 నుంచి రూ.30కి విక్రయించే కొబ్బరికాయ సోమవారం మార్కెట్‌లో రూ.50, డజను అరటిపండ్లు రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయించారు. కాగా వస్త్ర దుకాణాలు కూడా కిటకిటలాడాయి.