Share News

మార్కెట్లకు శ్రావణ శోభ

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:59 PM

జిల్లాలోని పలు మార్కెట్లు గురువారం శ్రావణ శోభను సంతరించుకున్నాయి. ఈ నెల 21న శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కావడంతో గురువారం మధ్యాహ్నం నుంచి మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి కనిపించింది.

మార్కెట్లకు శ్రావణ శోభ
కొనుగోలుదారులతో సందడిగా ఉన్న పాడేరు మార్కెట్‌

కొనుగోలుదారులతో కిటకిట

పాడేరురూరల్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మార్కెట్లు గురువారం శ్రావణ శోభను సంతరించుకున్నాయి. ఈ నెల 21న శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కావడంతో గురువారం మధ్యాహ్నం నుంచి మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి కనిపించింది. వస్త్ర, బంగారు, కిరాణా దుకాణాలు కిటకిటలాడాయి. సాధారణ రోజుల్లో రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయించే కొబ్బరికాయ వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో రూ.40 నుంచి రూ.50 వరకు ధర పలికింది. అలాగే రూ.50 ఉండే డజను అరటిపండ్లు రూ.70ల వరకు విక్రయించారు. పూల ధరలు ఆకాశాన్నంటాయి. అయినా వ్యాపారాలు జోరుగానే సాగాయి. కొనుగోలుదారులతో ప్రధాన రహదారులు రద్దీగా మారాయి.

Updated Date - Aug 20 , 2026 | 11:59 PM