Share News

నేడు మన్యం బంద్‌

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:20 PM

షెడ్యూల్డ్‌ ప్రాంత ఉద్యోగాల్లో ఎస్‌టీలకు శతశాతం రిజర్వేషన్‌ చట్టం రూపొందించాలని, 1/70 చట్ట పరిరక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలనే డిమాండ్లపై శనివారం మన్యం బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయు.

నేడు మన్యం బంద్‌
మన్యం బంద్‌ను విజయం చేయాలని కోరుతున్న గిరిజన నేతలు

జీవో 3 పునరుద్ధరణ, 1/70 పరిరక్షణకు డిమాండ్‌

పాడేరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ ప్రాంత ఉద్యోగాల్లో ఎస్‌టీలకు శతశాతం రిజర్వేషన్‌ చట్టం రూపొందించాలని, 1/70 చట్ట పరిరక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలనే డిమాండ్లపై శనివారం మన్యం బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయు. ఈ మేరకు బద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గిరిజన సంఘాల నేతలు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. వీటిపై సీఎం చంద్రబాబునాయుడు ఆదివాసీ దినోత్సవాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:20 PM